అనాది ప్రశ్నలు (Anadi Prashnalu)

అనాది ప్రశ్నలు (Anadi Prashnalu)
In this deeply philosophical poem, Santhapuri Raghuveer Rao (1932–2015) meditates on the eternal questions that accompany human existence. With imagery of endless cycles, cosmic uncertainty, and the mysterious powers guiding fate and intellect, this verse invites the reader to ponder the very roots and cycles of life, destiny, and truth.
అనాది ప్రశ్నలు ఎన్ని జన్మము లెత్తితినో...?
ఇంకెన్ని జన్మము లెత్తవలెనో...??
ఎన్ని జన్మములెత్తి చివరకు ఏమి అయి పోదునో ఏమో...!?
పుట్టుటేలనొ... గిట్టుటేలనొ...
ఎవరి నడుగుదు... ఎవరు చెబుదురు..?
వలయమా నీ కేంద్రమెక్కడ ఉన్నదో నీవైన చెప్పవే...??
దేని జూచిన యేదియో ఒక విధిని బట్టియె నడుస్తున్నది.
విధిని విధియించేది ఎవరో...?
మేధ మథియించేది ఎవరో...??
ఎవరి నడుగుదు.. నెవరి నడుగుదు..
ఎవరి నడిగిన నెవరు చెబుదురు..
ఎవరు విప్పుదు రెవరు విప్పుదు..
రెవరు విప్పుదు రిట్టి చిక్కును..!
ఉన్నావా మానవుడా!? విన్నావా ఈ సత్యం!?