పోస్ట్‌లు

Anweshana Kavithalu లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మార్పు (Marpu)

మార్పు (Marpu) In these succinct yet profound lines, Santhapuri Raghuveer Rao (1932–2015) expresses a ripple effect of change: as hearts change, so do individuals, communities, and eventually the world. But he reminds us—when we stray from the right path, consequences ("karma") inevitably follow. మనసు మారితే మనిషి మారును మనిషి మారితే జనం మారును జనం మారితే జగం మారును క్రమం తప్పితే 'ఖర్మం' మూడును.

రాతియుగంలోన మనిషి (Ratiyugamlo Manishi)

రాతియుగంలోన మనిషి (Ratiyugamlo Manishi) In this incisive poem, Santhapuri Raghuveer Rao (1932–2015) journeys through human history—from the Stone Age to the atomic age—to reflect on how mankind trades one illusion for the next. With every era, inner values and meaning seem to recede, while materialism and mechanization dominate. A philosophical contemplation on progress, loss, and the elusive search for true fulfillment. రాతియుగంలోన మనిషి పరమార్థం ఎఱుగలేక రాయి రప్ప పూజిస్తే పుట్టి పెరిగినట్టి గడ్డ లోహ యుగంలో మానవునికి లోభ గుణం ఎక్కువాయె.. ఏ యుగమ్మునైన గాని 'మెషిన్' యుగం లోన మనిషి 'యంత్ర' దాసుడై పోయెను ఒకటయితే కనిపించును పరమార్థం ఏమొ గాని పరమాణువు యుగంలోన “పరిమార్థం” తప్ప లేదు ఎవని చూచినా పాపపు చూపులే! ఏవి చూచినా లోభపు రూపులే! ఏమి మర్మమో...? ఏమి ఖర్మమో!

మొదటికె మోసం (Modatike Mosam)

మొదటికె మోసం (Modatike Mosam) With incisive irony, Santhapuri Raghuveer Rao (1932–2015) distills the enduring cycle of broken promises in politics and society. A timeless Telugu satire shining light on democracy, trust, and regret. సీటు కొఱకు ఓటు నడిగిన మాటకారిని నమ్మి మనం మాట మీద ఓటిస్తే మొదటికె మోసం వచ్చెను ఘాటు ఘాటు మాటలన్ని హాటు హాటు ఆవిరియై ఎటు పోయెనొ ఏమొ గాని అందా ‘అయిసై' పోయెను. మన మిచ్చిన మన ఓటే బల్లెపు పోటై పొడువగ ఎవనికి జెప్పుక ఏడ్తాం దేనితొ కొట్టుక చస్తాం. రోజు రోజుకూ...!

కవి కంట కోపం ఒలికితే...!? (Kavi Kanta Kopam Olukite!?)

కవి కంట కోపం ఒలికితే...!? (Kavi Kanta Kopam Olukite!?) Crafted by Santhapuri Raghuveer Rao (1932–2015), this poem is an impassioned ode to the enduring respect, power, and place of poets in society. A meditation on literary tradition in Telugu culture, it invokes legendary poets and calls for the recognition of poetic spirit in every generation. కవినే కాదంటావా మూఢమతీ... సుమతి శతక రచయితనే మరచితివా కుమతీ...!! అమర గ్రంథమునందించిన పోతననే పాతేస్తావా...? రాముని నామము గానము చేసిన త్యాగయ్య ఎవ్వరు..? అందెల రవళితో నీ హృది బంధించిన క్షేత్రయ్య ఎవ్వరు..? తత్త్వబోధ గావించిన పోతులూరి కవి కాడా...? మనిషే దేశము లెమ్మని పిలిచిన గురజాడ ఎవ్వరు...? ! వారు వీరన నెందుకు!? నీ లోపలి జీవే కవి... కవి అంటే రవే సుమా..! కవి లేని జాతి నిర్జీవం నిర్వీర్యం నిస్తేజం లెక్కకు మించిన భాస్కరులను సృష్టించిన రవి కూడా కవే సుమా..! కవి కుపితుడై శపిస్తే పతనం కాదా జగతి...! కవిని గౌరవించు... నీకూ నీ జాతికి భావి కవి...!

కవి (Kavi)

కవి (Kavi) A voyage into the poet’s soul. Penned by Santhapuri Raghuveer Rao (1932–2015), this work contemplates the poet’s purpose, endurance, and the joyous, eternal journey of creativity. A timeless meditation on what it means to be a “Kavi.” విశాల విశ్వాన్ని విద్యార్థిగ విలోకించి విసుగు లేక విమర్శించ గలుగు వాడె కవీశ్వరుడు....! ఉర్వీతలమున నిర్విరామముగ సర్వ వేళలను సర్వే చేసే వాడే ... సత్కవి ...! వాడే మహాకవి...!! గలగల పారే సెలయేరు వలె మిలమిల మెరిసే మింటి తార వలె ప్రవహిస్తూ పరుగిడుతూ మెరుస్తూ మెరిపిస్తూ ఆనందమ్మను అమృతకలశం అందలేదనే ఆవేదనతో నిరాశ చెందక వేదలను కుందక అలసట చెందక కలతల నొందక ఆదీ అంతం కనరాని ఎగుడు దిగుడు మార్గంలో లుక లుక లాడే డొక్కును కాలంతో పోటీపడి నెట్టుకు పోయే జీవే.. కవి...!!!

కావ్యం

కావ్యం (Kavyam) In this contemplative verse, Santhapuri Raghuveer Rao (1932–2015) reflects on the essence of poetry. The poem asserts that true poetry—lyrical or prose—touches the heart and is defined by its clarity and emotional resonance, not its form. It is a timeless celebration of the universality and depth of Telugu kavya. విద్యుద్వేగంతో ఎదుటి వాని హృది జొచ్చే పద్యమైనా గద్యమైనా శ్రావ్యము, సుగ్రాహ్యమైనదే కావ్యమనుటయె భావ్యమగును కేమి లోపము...? కావ్య వస్తువు విశ్వమంతా కావ్యమయమే...! పదాల పంచాయితీలో భావం పాలే తెగదు…

About the Author – Santhapuri Raghuveer Rao

Santhapuri Raghuveer Rao – Author Profile Santhapuri Raghuveer Rao – Author Profile Santhapuri Raghuveer Rao was a visionary literary figure, a freedom fighter from Telangana, and a senior journalist who made significant contributions to Indian media and Telugu literature. Journalistic Career Santhapuri Raghuveer Rao (late) was a visionary from Telangana — a freedom fighter, senior journalist, and profound Telugu poet. He was a founding member of both TPS (Telangana Praja Samithi) and TRS (Telangana Rashtra Samithi) , playing a vital role in shaping Telangana's political identity. In the 1960s, he served as a senior editor at Andhra Bhoomi and was instrumental in the 1969 Telangana Movement . Later, during the 1970s and 1980s, he held editorial leadership roles at Eenadu , influencing public opinion with his sharp, insightful journalism. Literary Legacy Beyond journalism, he authored hundreds of Telugu poems that explore the depths o...