పోస్ట్‌లు

Telugu Kavithalu లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సత్యం? (Satyam?)

సత్యం? (Satyam?) In this profound poem, Santhapuri Raghuveer Rao (1932–2015) explores the paradoxes of truth and existence. He reflects on the human journey through darkness and hunger, the spiritual essence embodied in the soul, and the sacred teachings found in the Vedas and Vedanta. This evocative verse calls upon humanity to listen deeply and witness the profound reality of life. సత్యం? బ్రతుకనే బ్రహ్మారణ్యంలో మానవుడను బాటసారి పోతూ ఉండగ... చీకటి..! ఆ ఆకటి చీకటిలో ప్రాణమనే పెనుభూతం మనిషిని మింగేసిందట కడుపు నిండ తినేసిందట కడుపు నిండ తిని త్రేన్చిన పులి తేల్పులే వేదాలట...! వేదాంతపు నాదాలట...!! వేదాలలో ప్రబోధాలు మనిషి మనుగడకు ధర్మ సూత్రాలు...!! పద్యంలో హృద్యంగా మహామేధ గణపతితో వ్రాయించిందట. వింటావా మానవుడా...? కంటావా సత్యం...??

అనాది ప్రశ్నలు (Anadi Prashnalu)

అనాది ప్రశ్నలు (Anadi Prashnalu) In this deeply philosophical poem, Santhapuri Raghuveer Rao (1932–2015) meditates on the eternal questions that accompany human existence. With imagery of endless cycles, cosmic uncertainty, and the mysterious powers guiding fate and intellect, this verse invites the reader to ponder the very roots and cycles of life, destiny, and truth. అనాది ప్రశ్నలు ఎన్ని జన్మము లెత్తితినో...? ఇంకెన్ని జన్మము లెత్తవలెనో...?? ఎన్ని జన్మములెత్తి చివరకు ఏమి అయి పోదునో ఏమో...!? పుట్టుటేలనొ... గిట్టుటేలనొ... ఎవరి నడుగుదు... ఎవరు చెబుదురు..? వలయమా నీ కేంద్రమెక్కడ ఉన్నదో నీవైన చెప్పవే...?? దేని జూచిన యేదియో ఒక విధిని బట్టియె నడుస్తున్నది. విధిని విధియించేది ఎవరో...? మేధ మథియించేది ఎవరో...?? ఎవరి నడుగుదు.. నెవరి నడుగుదు.. ఎవరి నడిగిన నెవరు చెబుదురు.. ఎవరు విప్పుదు రెవరు విప్పుదు.. రెవరు విప్పుదు రిట్టి చిక్కును..! ఉన్నావా మానవుడా!? విన్నావా ఈ సత్యం!?

ప్రశ్నోపనిషత్ (Prashnopanishat)

ప్రశ్నోపనిషత్ (Prashnopanishat) In this introspective poem, Santhapuri Raghuveer Rao (1932–2015) embraces the wisdom of unanswered questions and the human quest for understanding. Echoing the spirit of the Upanishads, Rao meditates on the nature of self, time, and the ungraspable mysteries behind what is before and what follows. A poetic journey into the heart of wonder and philosophical inquiry. ఎఱుగలేను ఏమి నేను...? ఎఱుగు దెలుపు పెరుగువాడ...? ఏది ముందు...? ఏది వెనుక...?? ఎవరు ముందు...? ఎవరు వెనుక...? వెనుక ముందు ముందు వెనుక ఊహకు అందని తిక మక...!

అందము నారాధించని దెవ్వరు...? (Andamu Naradhinchani Devvaru!?)

అందము నారాధించని దెవ్వరు...? (Andamu Naradhinchani Devvaru!?) In this lyrical meditation, Santhapuri Raghuveer Rao (1932–2015) ponders the universal reverence for beauty and emotional resonance. He marvels at how no one can resist adoring blossoming flowers or a graceful presence, and yet asks: who can remain as serene and unshaken as a still, beautiful lake unmoved by passing winds? విరియ బూసిన పూల లతను పూనికతో పూజించని దెవ్వరు...? నిండైన దేహంతో ఒలుకుతున్న చూపులతో కులికెడి తరుణిని జూచి ఉలుకు చెందని దెవ్వరు...? కాని, ఏ గాలులకీ చెదరని స్థిర సురుచిర సరస్సులా నిలిచే దెందరు...?

భావమేది అయితేనేమి...!? (Bhavamedi Ayithenemi!?)

భావమేది అయితేనేమి...!? (Bhavamedi Ayithenemi!?) A candid expression by Santhapuri Raghuveer Rao (1932–2015) contemplating the limitations of ego and superficial emotions. This poem warns that arrogance and false pride ultimately lead to downfall, urging humility and genuineness in human conduct. అహం భావ మొద్దు సుమా...! విర్రవీగి నోడు ఎవడు బాగు పడలేడు సుమా...!!

ఎక్సెప్షన్ (Exception)

ఎక్సెప్షన్ (Exception) In this candid and introspective verse, Santhapuri Raghuveer Rao (1932–2015) reflects on the common human gap between ideal and practice. While great moral principles are easy to articulate, he admits, applying them without exception in our own lives is always the real challenge—a timeless observation on human nature. గొప్ప గొప్ప సూత్రాలను ఒప్ప జెప్పగలను గాని స్వీయాచరణకు కొంచెం ఎక్సెప్షన్ ఉండక తప్పదు

కన్ఫ్యూజన్ ముట్టడి (Confusion Muttadi)

కన్ఫ్యూజన్ ముట్టడి (Confusion Muttadi) In this poignant poem, Santhapuri Raghuveer Rao (1932–2015) captures the societal turmoil caused by confusion and misinformation. Highlighting the distress and fatigue among people caught between truths and falsehoods, the poem is a powerful reflection on public unrest and the chaos of conflicting narratives. ఇజా యిజాల మధ్య నిజా నిజాలు సుంత అయిన తెలియలేక జనం గిజా గిజా కొట్టుకుంటూ బేజారై పోతున్నది

జీవన తరణం (Jeevana Taranam)

జీవన తరణం (Jeevana Taranam) This evocative poem by Santhapuri Raghuveer Rao (1932–2015) journeys through the metaphor of a boat navigating the currents of life. It reflects on childhood, loss, growth, and the enduring connection to a nurturing mother—the “Māyammā”—amidst the shifting tides of time and personal transformation. జీవితమ్మనెడు సెలయేరు ముందుండె జోల పాటలు పాడ మాయమ్మ లేకుండె పక్షి రూపము తాను తాల్చి వచ్చిందేమొ పాట పాడి నన్ను నిదుర పుచ్చింది నా నావ కదలికకు కలిగేటి బడలికను కమ్మని పాటలే పాడంగ పారుతూ తీర్చుటకు చిరు అలలు చిట్టంట్లు వేస్తుండ కదిలింది కదిలింది నా చిన్ని నావ నడిచింది నడిచింది నా చిన్ని నావ చిచ్చు కొట్టిన యట్లు భావించు వాడ.. అందాలు చిలికేటి ఆ నావలో నన్ను ఆపైన కనుమూసి నిదురించు వాడ. కాలాలు గడిచినవి రూపాలు మారినవి ఒడి విడిచి వేసింది నా కన్న తల్లి చిరు ప్రాయమును గడిచి బాల్యమును వెనకేసి ఒంటరిగానే నన్ను ఒదిలి పెట్టింది యౌవనమ్మనే దీవి చేరుకొన్నాను మాయమ్మ మాకింక ఒడిసి పోయ...

మార్పు (Marpu)

మార్పు (Marpu) In these succinct yet profound lines, Santhapuri Raghuveer Rao (1932–2015) expresses a ripple effect of change: as hearts change, so do individuals, communities, and eventually the world. But he reminds us—when we stray from the right path, consequences ("karma") inevitably follow. మనసు మారితే మనిషి మారును మనిషి మారితే జనం మారును జనం మారితే జగం మారును క్రమం తప్పితే 'ఖర్మం' మూడును.

అంతః శత్రువు (Antah Shatruvu)

అంతః శత్రువు (Antah Shatruvu) In this compact yet powerful reflection, Santhapuri Raghuveer Rao (1932–2015) warns us that the true enemy often lurks within. With vivid imagery, he likens our nurturing of inner negativity to feeding milk to a venomous serpent, urging readers toward self-awareness and vigilance against inner threats. పేల్చి వేయబూనె నిపుడు మన శత్రువు మనలోనే మనుతునని గమనించక విష సర్పానికి క్షీరం కుడుపుచు మనుచునున్నాము.

మొదటికె మోసం (Modatike Mosam)

మొదటికె మోసం (Modatike Mosam) With incisive irony, Santhapuri Raghuveer Rao (1932–2015) distills the enduring cycle of broken promises in politics and society. A timeless Telugu satire shining light on democracy, trust, and regret. సీటు కొఱకు ఓటు నడిగిన మాటకారిని నమ్మి మనం మాట మీద ఓటిస్తే మొదటికె మోసం వచ్చెను ఘాటు ఘాటు మాటలన్ని హాటు హాటు ఆవిరియై ఎటు పోయెనొ ఏమొ గాని అందా ‘అయిసై' పోయెను. మన మిచ్చిన మన ఓటే బల్లెపు పోటై పొడువగ ఎవనికి జెప్పుక ఏడ్తాం దేనితొ కొట్టుక చస్తాం. రోజు రోజుకూ...!

కవి కంట కోపం ఒలికితే...!? (Kavi Kanta Kopam Olukite!?)

కవి కంట కోపం ఒలికితే...!? (Kavi Kanta Kopam Olukite!?) Crafted by Santhapuri Raghuveer Rao (1932–2015), this poem is an impassioned ode to the enduring respect, power, and place of poets in society. A meditation on literary tradition in Telugu culture, it invokes legendary poets and calls for the recognition of poetic spirit in every generation. కవినే కాదంటావా మూఢమతీ... సుమతి శతక రచయితనే మరచితివా కుమతీ...!! అమర గ్రంథమునందించిన పోతననే పాతేస్తావా...? రాముని నామము గానము చేసిన త్యాగయ్య ఎవ్వరు..? అందెల రవళితో నీ హృది బంధించిన క్షేత్రయ్య ఎవ్వరు..? తత్త్వబోధ గావించిన పోతులూరి కవి కాడా...? మనిషే దేశము లెమ్మని పిలిచిన గురజాడ ఎవ్వరు...? ! వారు వీరన నెందుకు!? నీ లోపలి జీవే కవి... కవి అంటే రవే సుమా..! కవి లేని జాతి నిర్జీవం నిర్వీర్యం నిస్తేజం లెక్కకు మించిన భాస్కరులను సృష్టించిన రవి కూడా కవే సుమా..! కవి కుపితుడై శపిస్తే పతనం కాదా జగతి...! కవిని గౌరవించు... నీకూ నీ జాతికి భావి కవి...!

About the Author – Santhapuri Raghuveer Rao

Santhapuri Raghuveer Rao – Author Profile Santhapuri Raghuveer Rao – Author Profile Santhapuri Raghuveer Rao was a visionary literary figure, a freedom fighter from Telangana, and a senior journalist who made significant contributions to Indian media and Telugu literature. Journalistic Career Santhapuri Raghuveer Rao (late) was a visionary from Telangana — a freedom fighter, senior journalist, and profound Telugu poet. He was a founding member of both TPS (Telangana Praja Samithi) and TRS (Telangana Rashtra Samithi) , playing a vital role in shaping Telangana's political identity. In the 1960s, he served as a senior editor at Andhra Bhoomi and was instrumental in the 1969 Telangana Movement . Later, during the 1970s and 1980s, he held editorial leadership roles at Eenadu , influencing public opinion with his sharp, insightful journalism. Literary Legacy Beyond journalism, he authored hundreds of Telugu poems that explore the depths o...