జీవన తరణం (Jeevana Taranam)

జీవన తరణం (Jeevana Taranam)
This evocative poem by Santhapuri Raghuveer Rao (1932–2015) journeys through the metaphor of a boat navigating the currents of life. It reflects on childhood, loss, growth, and the enduring connection to a nurturing mother—the “Māyammā”—amidst the shifting tides of time and personal transformation.
జీవితమ్మనెడు సెలయేరు ముందుండె జోల పాటలు పాడ మాయమ్మ లేకుండె
పక్షి రూపము తాను తాల్చి వచ్చిందేమొ
పాట పాడి నన్ను నిదుర పుచ్చింది
నా నావ కదలికకు కలిగేటి బడలికను
కమ్మని పాటలే పాడంగ పారుతూ
తీర్చుటకు చిరు అలలు చిట్టంట్లు వేస్తుండ కదిలింది కదిలింది
నా చిన్ని నావ నడిచింది నడిచింది
నా చిన్ని నావ చిచ్చు కొట్టిన యట్లు భావించు వాడ..
అందాలు చిలికేటి ఆ నావలో నన్ను ఆపైన కనుమూసి నిదురించు వాడ.
కాలాలు గడిచినవి రూపాలు మారినవి
ఒడి విడిచి వేసింది నా కన్న తల్లి
చిరు ప్రాయమును గడిచి బాల్యమును వెనకేసి
ఒంటరిగానే నన్ను ఒదిలి పెట్టింది
యౌవనమ్మనే దీవి చేరుకొన్నాను మాయమ్మ మాకింక ఒడిసి పోయింది.
నవ్య జగతిలో నేను అడుగుపెట్టాను నవ మాసములు పొట్ట నిండుగా కూర్చుని
ఎవరి సామ్రాజ్యమో ఏమొ ఎటు చూసినా గాని
మా యమ్మ నెత్తురును మంచిగా త్రాగాను విరియ బూసిన పూల మాలలే మాలలు
తిండి లేకుండానే కండ పెంచాను ధరియించి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు
మెండుగా బలిసి నే కండ్లు తెరిచాను కనపడె పూలతలు కనుల కానాడు డొక్క ఎండి తాను బక్క చిక్కిన గాని
ఎన్నాళ్ళు.... కొన్నాళ్ళే అక్కడున్నాను
తన రక్త ధారల్ని పాల్టేసి కుడిపింది
అంతలోనే సూర్య తపము చూశాను గోరు ముద్దలతో బుజ్జగించింది
కంటి పాపగ నన్ను పెంపు చేసింది పూళతలు బోడులై మోడువారినవి
యౌవనపు నా దీవి బీడు వారినది నా తల్లి
నా నావ కోసమె నీట నేను పెట్టిన ఘోర బాధలకో ఏమొ మునుగకను తేలకను కాచుకొని ఉంది
మాయమ్మ నాపైన కోపగించిందేమొ నేను కూర్చున్నాను నా నావ కదిలింది.
చీకటులు చుట్టుకొనగ చిమ్మెటలుగ పెట్ట కొంత సేపటిలోనే నీరు నిండింది
పెద్ద పెట్టున గాలివాన వచ్చింది అల్లంత దూరాన ఉన్న మాయమ్మ రా... బాబు! రమ్ము” అంటు సైగ చేసింది
ఉరుము మెరుపులలోన కళ్ళు తెరిచాను సప్త సాగరాల తరియించి
నేనింక నన్ను పొత్తిళ్ళలో పెట్టుకొని పెంచిన మాయమ్మ నా కింక లేకపోయింది
ఆపైన నేనెరుగ ఏమాయెనో ఏమొ మాయమ్మ మనసులో కెళ్ళిపోతాను.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The Man Who Created the Leaders Who Created Telangana — Santhapuri Raghuveer Rao, Freedom Fighter and Senior Journalist

భారతాంధ్ర (Bharatandra)

అహం కాదు జగం (Aham Kadu Jagam)