పోస్ట్‌లు

Thoughts of a Freedom Fighter లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సత్యం? (Satyam?)

సత్యం? (Satyam?) In this profound poem, Santhapuri Raghuveer Rao (1932–2015) explores the paradoxes of truth and existence. He reflects on the human journey through darkness and hunger, the spiritual essence embodied in the soul, and the sacred teachings found in the Vedas and Vedanta. This evocative verse calls upon humanity to listen deeply and witness the profound reality of life. సత్యం? బ్రతుకనే బ్రహ్మారణ్యంలో మానవుడను బాటసారి పోతూ ఉండగ... చీకటి..! ఆ ఆకటి చీకటిలో ప్రాణమనే పెనుభూతం మనిషిని మింగేసిందట కడుపు నిండ తినేసిందట కడుపు నిండ తిని త్రేన్చిన పులి తేల్పులే వేదాలట...! వేదాంతపు నాదాలట...!! వేదాలలో ప్రబోధాలు మనిషి మనుగడకు ధర్మ సూత్రాలు...!! పద్యంలో హృద్యంగా మహామేధ గణపతితో వ్రాయించిందట. వింటావా మానవుడా...? కంటావా సత్యం...??

అందము నారాధించని దెవ్వరు...? (Andamu Naradhinchani Devvaru!?)

అందము నారాధించని దెవ్వరు...? (Andamu Naradhinchani Devvaru!?) In this lyrical meditation, Santhapuri Raghuveer Rao (1932–2015) ponders the universal reverence for beauty and emotional resonance. He marvels at how no one can resist adoring blossoming flowers or a graceful presence, and yet asks: who can remain as serene and unshaken as a still, beautiful lake unmoved by passing winds? విరియ బూసిన పూల లతను పూనికతో పూజించని దెవ్వరు...? నిండైన దేహంతో ఒలుకుతున్న చూపులతో కులికెడి తరుణిని జూచి ఉలుకు చెందని దెవ్వరు...? కాని, ఏ గాలులకీ చెదరని స్థిర సురుచిర సరస్సులా నిలిచే దెందరు...?

భావమేది అయితేనేమి...!? (Bhavamedi Ayithenemi!?)

భావమేది అయితేనేమి...!? (Bhavamedi Ayithenemi!?) A candid expression by Santhapuri Raghuveer Rao (1932–2015) contemplating the limitations of ego and superficial emotions. This poem warns that arrogance and false pride ultimately lead to downfall, urging humility and genuineness in human conduct. అహం భావ మొద్దు సుమా...! విర్రవీగి నోడు ఎవడు బాగు పడలేడు సుమా...!!

అహం కాదు జగం (Aham Kadu Jagam)

అహం కాదు జగం (Aham Kadu Jagam) In this evocative poem, Santhapuri Raghuveer Rao (1932–2015) reflects on the interconnectedness of the individual and the world. He denies the notion of isolated ego, emphasizing that one is not alone but part of a vast collective of millions. The poem invites opening one’s eyes to the flowing currents of life and recognizing the world as a friend. నీ వొకడవే కాదు జగం కోటాను కోట్ల జనం..! కాదనంగ ఎవరి తరం...? కాదు కాదు... నమ్ము నిజం...!! కళ్ళు తెరచి కలయ జూడు పారుతున్న ప్రవాహం చూడకున్న చూడబోదు జగం నిన్ను నేస్తం...

చిత్త వృత్తి నిరోధం (Chitta Vritti Nirodham)

చిత్త వృత్తి నిరోధం (Chitta Vritti Nirodham) In this profound verse, Santhapuri Raghuveer Rao (1932–2015) explores the spiritual journey of human consciousness. The poem contrasts worldly indulgences and their afflictions with the healing power of yoga, portraying the yogic path as the gateway to a blissful, unattainable world free from disease, anger, greed, and delusion. భోగాలలో మునిగి తేలు. భోగికి రోగం మందు రోగాలతో బాధపడే రోగికి యోగం మందు. యోగమనే మార్గాన మనిషి యాత్ర సాగినపుడు రోగానికి, కోపానికి లోభానికి, మోహానికి అందని ఆనంద జగతిని ఆహ్వానిస్తుం దతనిని...!

ఎక్సెప్షన్ (Exception)

ఎక్సెప్షన్ (Exception) In this candid and introspective verse, Santhapuri Raghuveer Rao (1932–2015) reflects on the common human gap between ideal and practice. While great moral principles are easy to articulate, he admits, applying them without exception in our own lives is always the real challenge—a timeless observation on human nature. గొప్ప గొప్ప సూత్రాలను ఒప్ప జెప్పగలను గాని స్వీయాచరణకు కొంచెం ఎక్సెప్షన్ ఉండక తప్పదు

అద్వైతం (Advaitam)

అద్వైతం (Advaitam) This contemplative poem by Santhapuri Raghuveer Rao (1932–2015) delves into the essence of non-duality—the profound unity beyond the apparent separateness of self and other. It beautifully reflects on the eternal bond of existence where the individual dissolves into the universal whole, affirming that life and the cosmos are inseparably intertwined. నిన్ను మరచుటె కాకపోగా నన్ను నేనె మరచి పోతిని నీవే నేనూ, నేనే నీవని మదిని ఎన్నడు దలచనైతిని.. అణువున ఒదిగెడి ప్రాణం విశ్వము కంతా త్రాణం..

భవ మగ్నులు (Bhava Magnulu) - Ignorants

భవ మగ్నులు (Bhava Magnulu) This powerful poem by Santhapuri Raghuveer Rao (1932–2015) critiques blindness to reality and folly among people trapped in ignorance. It calls for awakening—only then can truth and light emerge from the depths of confusion and turbulent emotions. ముక్కు కొసను చూడలేని మూర్ఖాగ్రేసరులం మనము మూట ముల్లె ముఖ్యమని మూఢులమై పోయినాము. మెలకువతో మెలగినపుడె వెలుగు జూడగలం.. నిజం. ఖలుల వలెను చెలగి యాడ జలధి సుడుల మునుగుదుము...

అంతము (Antamu)

అంతము (Antamu) In this profound poem, Santhapuri Raghuveer Rao (1932–2015) meditates on the eternal elements sustaining life and the omnipresence of divine intelligence in all beings. It reflects on the interconnectedness of all creation through the consciousness he embraces as Brahma, Vishnu, and Shiva—the timeless trinity of Hindu philosophy. The poem suggests that all that is past, present, or future, known or unknown, ultimately belongs to the same dissolution. అన్నం గాలి నీరు ఎడ తెగకుండా పారు... నేను నీవు వాడు బ్రహ్మ విష్ణు శివుడు నిన్న నేడు రేపు తెలిసిన సర్వం 'సావు'

మానవత్వం (Humanity)

మానవత్వం (Humanity) In this profound and contemplative verse, Santhapuri Raghuveer Rao (1932–2015) reflects on the essence of humanity, compassion, and generosity. He emphasizes that without heart, kindness, and giving, labels like ‘human’ or ‘good’ lose their meaning, and even fire cannot consume what lacks substance. మనసన్నది లేని వాణ్ణి 'మనిషి' అని అనడం తగదు దయ అన్నది లేని వాణ్ణి 'దయ్యం' అనడం భావ్యం దానం చెయ్యని పీచుకు దహనాని'కి నిప్పుండదు.

కన్ఫ్యూజన్ ముట్టడి (Confusion Muttadi)

కన్ఫ్యూజన్ ముట్టడి (Confusion Muttadi) In this poignant poem, Santhapuri Raghuveer Rao (1932–2015) captures the societal turmoil caused by confusion and misinformation. Highlighting the distress and fatigue among people caught between truths and falsehoods, the poem is a powerful reflection on public unrest and the chaos of conflicting narratives. ఇజా యిజాల మధ్య నిజా నిజాలు సుంత అయిన తెలియలేక జనం గిజా గిజా కొట్టుకుంటూ బేజారై పోతున్నది

జీవన తరణం (Jeevana Taranam)

జీవన తరణం (Jeevana Taranam) This evocative poem by Santhapuri Raghuveer Rao (1932–2015) journeys through the metaphor of a boat navigating the currents of life. It reflects on childhood, loss, growth, and the enduring connection to a nurturing mother—the “Māyammā”—amidst the shifting tides of time and personal transformation. జీవితమ్మనెడు సెలయేరు ముందుండె జోల పాటలు పాడ మాయమ్మ లేకుండె పక్షి రూపము తాను తాల్చి వచ్చిందేమొ పాట పాడి నన్ను నిదుర పుచ్చింది నా నావ కదలికకు కలిగేటి బడలికను కమ్మని పాటలే పాడంగ పారుతూ తీర్చుటకు చిరు అలలు చిట్టంట్లు వేస్తుండ కదిలింది కదిలింది నా చిన్ని నావ నడిచింది నడిచింది నా చిన్ని నావ చిచ్చు కొట్టిన యట్లు భావించు వాడ.. అందాలు చిలికేటి ఆ నావలో నన్ను ఆపైన కనుమూసి నిదురించు వాడ. కాలాలు గడిచినవి రూపాలు మారినవి ఒడి విడిచి వేసింది నా కన్న తల్లి చిరు ప్రాయమును గడిచి బాల్యమును వెనకేసి ఒంటరిగానే నన్ను ఒదిలి పెట్టింది యౌవనమ్మనే దీవి చేరుకొన్నాను మాయమ్మ మాకింక ఒడిసి పోయ...

ఎడారి కడుపులో.... (Edari Kadupulo....)

ఎడారి కడుపులో.... (Edari Kadupulo....) In this evocative meditation, Santhapuri Raghuveer Rao (1932–2015) likens the world to a boundless desert—dunes of sand, unmarked paths, tempests, and the relentless journey of life. Through stunning imagery, he reflects on how countless caravans—of knowledge, art, and civilizations—have traveled and come to rest in this endless Sahara of existence. ఈ ప్రపంచ మొక ఇసుక ఎడారి నడచిన త్రోవ నడువని దారి తుఫాను గాడ్పుల పరిణామ మెగడ ఎడారి దిబ్బ దిబ్బ ఎడారి... కారవాసులకు కారవానులు ఈ సహారాలో పయనించినవి విద్యలు కళలు సంస్కృతులెన్నో ఈ సహారాలో శయనించినవి.

తుంపిళ్ళ బలం (Tumpilla Balam)

తుంపిళ్ళ బలం (Tumpilla Balam) In this sharp, witty verse, Santhapuri Raghuveer Rao (1932–2015) draws a timeless satire between the fortresses of past kings and today’s political theater. Once rulers relied on walls and armies, but now, leaders build castles of words and fight their battles armed only with “the power of rhetoric.” వెనుకటి రాజులు అంతా కోటలు, గడీలు గత్తే బడాయీల నేతలిపుడు మాటల కోటలు గట్టి 'తుంపిళ్ళ బలం' మీద లడాయీకి తయారైరి.

ప్రతిబింబము (Pratibimbamu)

ప్రతిబింబము (Pratibimbamu) A gentle reflection by Santhapuri Raghuveer Rao (1932–2015) reminding us that both criticism and praise mirror back upon us. This evocative couplet invites us to remember that our own qualities and actions are often reflected in the world around us. దూషించిన దూషింతురు భూషించిన భూషింతురు నీవెట్లో పరులట్లే అని మదిలో మరువ బోకు.

కవి (Kavi)

కవి (Kavi) A voyage into the poet’s soul. Penned by Santhapuri Raghuveer Rao (1932–2015), this work contemplates the poet’s purpose, endurance, and the joyous, eternal journey of creativity. A timeless meditation on what it means to be a “Kavi.” విశాల విశ్వాన్ని విద్యార్థిగ విలోకించి విసుగు లేక విమర్శించ గలుగు వాడె కవీశ్వరుడు....! ఉర్వీతలమున నిర్విరామముగ సర్వ వేళలను సర్వే చేసే వాడే ... సత్కవి ...! వాడే మహాకవి...!! గలగల పారే సెలయేరు వలె మిలమిల మెరిసే మింటి తార వలె ప్రవహిస్తూ పరుగిడుతూ మెరుస్తూ మెరిపిస్తూ ఆనందమ్మను అమృతకలశం అందలేదనే ఆవేదనతో నిరాశ చెందక వేదలను కుందక అలసట చెందక కలతల నొందక ఆదీ అంతం కనరాని ఎగుడు దిగుడు మార్గంలో లుక లుక లాడే డొక్కును కాలంతో పోటీపడి నెట్టుకు పోయే జీవే.. కవి...!!!

About the Author – Santhapuri Raghuveer Rao

Santhapuri Raghuveer Rao – Author Profile Santhapuri Raghuveer Rao – Author Profile Santhapuri Raghuveer Rao was a visionary literary figure, a freedom fighter from Telangana, and a senior journalist who made significant contributions to Indian media and Telugu literature. Journalistic Career Santhapuri Raghuveer Rao (late) was a visionary from Telangana — a freedom fighter, senior journalist, and profound Telugu poet. He was a founding member of both TPS (Telangana Praja Samithi) and TRS (Telangana Rashtra Samithi) , playing a vital role in shaping Telangana's political identity. In the 1960s, he served as a senior editor at Andhra Bhoomi and was instrumental in the 1969 Telangana Movement . Later, during the 1970s and 1980s, he held editorial leadership roles at Eenadu , influencing public opinion with his sharp, insightful journalism. Literary Legacy Beyond journalism, he authored hundreds of Telugu poems that explore the depths o...