కవి (Kavi)
కవి (Kavi)
A voyage into the poet’s soul. Penned by Santhapuri Raghuveer Rao (1932–2015), this work contemplates the poet’s purpose, endurance, and the joyous, eternal journey of creativity. A timeless meditation on what it means to be a “Kavi.”
విశాల విశ్వాన్ని విద్యార్థిగ విలోకించి
విసుగు లేక విమర్శించ గలుగు వాడె కవీశ్వరుడు....!
ఉర్వీతలమున నిర్విరామముగ సర్వ వేళలను సర్వే చేసే వాడే ... సత్కవి ...!
వాడే మహాకవి...!!
గలగల పారే సెలయేరు వలె మిలమిల మెరిసే మింటి తార వలె ప్రవహిస్తూ పరుగిడుతూ
మెరుస్తూ మెరిపిస్తూ ఆనందమ్మను
అమృతకలశం అందలేదనే ఆవేదనతో నిరాశ చెందక వేదలను కుందక
అలసట చెందక కలతల నొందక
ఆదీ అంతం కనరాని ఎగుడు దిగుడు మార్గంలో
లుక లుక లాడే డొక్కును కాలంతో పోటీపడి నెట్టుకు పోయే జీవే.. కవి...!!!