పోస్ట్‌లు

Modern Telugu Poetry లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

భారతాంధ్ర (Bharatandra)

భారతాంధ్ర (Bharatandra) A moving tribute by Santhapuri Raghuveer Rao (1932–2015) reflecting on the emotive pulse of Andhra Pradesh, evoking vivid imagery of the fertile land, its nurturing river Godavari, and the mixed emotions of joy and sorrow within the hearts of its people during times of change and hope. This poem captures the profound relationship between motherland and her children, immersed in cultural pride and poignant tears. భారతాంధ్ర భారతావని బిడ్డ ఆంధ్రమాతకు నేడు ఆనంద సమయాన కళ్ళు చెమ్మగిల్లెనేమి...! నందనుల పరవళ్ళు పరవశం గొలిపెనా...? మందభాగ్యుల చూసి లోలోన కుమిలెనా...? చెమ్మగిలిన కళ్ళు బొట బొటా రాలగా గోదావరీ తల్లి గొప్పగా ఉప్పొంగె... హర్ష మతిశయించ అశ్రువులు రాలెనా...? దుఖ మతిశయించ కన్నీరు కారెనా...? (ఆంధ్రావతరణం ' సందర్భంగా)

సత్యం? (Satyam?)

సత్యం? (Satyam?) In this profound poem, Santhapuri Raghuveer Rao (1932–2015) explores the paradoxes of truth and existence. He reflects on the human journey through darkness and hunger, the spiritual essence embodied in the soul, and the sacred teachings found in the Vedas and Vedanta. This evocative verse calls upon humanity to listen deeply and witness the profound reality of life. సత్యం? బ్రతుకనే బ్రహ్మారణ్యంలో మానవుడను బాటసారి పోతూ ఉండగ... చీకటి..! ఆ ఆకటి చీకటిలో ప్రాణమనే పెనుభూతం మనిషిని మింగేసిందట కడుపు నిండ తినేసిందట కడుపు నిండ తిని త్రేన్చిన పులి తేల్పులే వేదాలట...! వేదాంతపు నాదాలట...!! వేదాలలో ప్రబోధాలు మనిషి మనుగడకు ధర్మ సూత్రాలు...!! పద్యంలో హృద్యంగా మహామేధ గణపతితో వ్రాయించిందట. వింటావా మానవుడా...? కంటావా సత్యం...??

అందము నారాధించని దెవ్వరు...? (Andamu Naradhinchani Devvaru!?)

అందము నారాధించని దెవ్వరు...? (Andamu Naradhinchani Devvaru!?) In this lyrical meditation, Santhapuri Raghuveer Rao (1932–2015) ponders the universal reverence for beauty and emotional resonance. He marvels at how no one can resist adoring blossoming flowers or a graceful presence, and yet asks: who can remain as serene and unshaken as a still, beautiful lake unmoved by passing winds? విరియ బూసిన పూల లతను పూనికతో పూజించని దెవ్వరు...? నిండైన దేహంతో ఒలుకుతున్న చూపులతో కులికెడి తరుణిని జూచి ఉలుకు చెందని దెవ్వరు...? కాని, ఏ గాలులకీ చెదరని స్థిర సురుచిర సరస్సులా నిలిచే దెందరు...?

ఎక్సెప్షన్ (Exception)

ఎక్సెప్షన్ (Exception) In this candid and introspective verse, Santhapuri Raghuveer Rao (1932–2015) reflects on the common human gap between ideal and practice. While great moral principles are easy to articulate, he admits, applying them without exception in our own lives is always the real challenge—a timeless observation on human nature. గొప్ప గొప్ప సూత్రాలను ఒప్ప జెప్పగలను గాని స్వీయాచరణకు కొంచెం ఎక్సెప్షన్ ఉండక తప్పదు

ఎడారి కడుపులో.... (Edari Kadupulo....)

ఎడారి కడుపులో.... (Edari Kadupulo....) In this evocative meditation, Santhapuri Raghuveer Rao (1932–2015) likens the world to a boundless desert—dunes of sand, unmarked paths, tempests, and the relentless journey of life. Through stunning imagery, he reflects on how countless caravans—of knowledge, art, and civilizations—have traveled and come to rest in this endless Sahara of existence. ఈ ప్రపంచ మొక ఇసుక ఎడారి నడచిన త్రోవ నడువని దారి తుఫాను గాడ్పుల పరిణామ మెగడ ఎడారి దిబ్బ దిబ్బ ఎడారి... కారవాసులకు కారవానులు ఈ సహారాలో పయనించినవి విద్యలు కళలు సంస్కృతులెన్నో ఈ సహారాలో శయనించినవి.

'?' నాటి నుండి నేటి వరకు (Introspect)

'?' నాటి నుండి నేటి వరకు (From “?” Then Till Now) In this philosophical piece, Santhapuri Raghuveer Rao (1932–2015) questions the nature of human progress. Since time immemorial, has mankind truly advanced, or are we endlessly repeating cycles—burying and uncovering peaks—without ever finding true meaning? '?' నాటి నుండి నేటి వరకు మనిషి సాధించిం దేమిటి...? శిఖరాలకు పూడ్చి తిరిగి పూడిక తీయడమేనా...!?

ప్రతిబింబము (Pratibimbamu)

ప్రతిబింబము (Pratibimbamu) A gentle reflection by Santhapuri Raghuveer Rao (1932–2015) reminding us that both criticism and praise mirror back upon us. This evocative couplet invites us to remember that our own qualities and actions are often reflected in the world around us. దూషించిన దూషింతురు భూషించిన భూషింతురు నీవెట్లో పరులట్లే అని మదిలో మరువ బోకు.

కవి కంట కోపం ఒలికితే...!? (Kavi Kanta Kopam Olukite!?)

కవి కంట కోపం ఒలికితే...!? (Kavi Kanta Kopam Olukite!?) Crafted by Santhapuri Raghuveer Rao (1932–2015), this poem is an impassioned ode to the enduring respect, power, and place of poets in society. A meditation on literary tradition in Telugu culture, it invokes legendary poets and calls for the recognition of poetic spirit in every generation. కవినే కాదంటావా మూఢమతీ... సుమతి శతక రచయితనే మరచితివా కుమతీ...!! అమర గ్రంథమునందించిన పోతననే పాతేస్తావా...? రాముని నామము గానము చేసిన త్యాగయ్య ఎవ్వరు..? అందెల రవళితో నీ హృది బంధించిన క్షేత్రయ్య ఎవ్వరు..? తత్త్వబోధ గావించిన పోతులూరి కవి కాడా...? మనిషే దేశము లెమ్మని పిలిచిన గురజాడ ఎవ్వరు...? ! వారు వీరన నెందుకు!? నీ లోపలి జీవే కవి... కవి అంటే రవే సుమా..! కవి లేని జాతి నిర్జీవం నిర్వీర్యం నిస్తేజం లెక్కకు మించిన భాస్కరులను సృష్టించిన రవి కూడా కవే సుమా..! కవి కుపితుడై శపిస్తే పతనం కాదా జగతి...! కవిని గౌరవించు... నీకూ నీ జాతికి భావి కవి...!